విజయవాడ: గొల్లపూడి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో భవనంపైనుంచి దూకిన విద్యార్థిని లోహితారెడ్డి మృతి చెందారు. ఖమ్మంజిల్లాకు చెందిన లోహితారెడ్డి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. జూన్‌లో రెసిడెన్షియల్ విద్యార్థినిగా ఉన్న ఆమె మూడు రోజుల క్రితం ఇంటినుంచి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భవనంపైనుంచి దూకింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందింది. హోమ్‌సిక్ వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఆగష్టు 12, 2009
థియేటర్ ప్రమాదాలపై కౌంటర్ దాఖలుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: మగధీర చిత్ర ప్రదర్శన సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందిన సంఘటనలపై 15 రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సరైన వైరింగ్ కాని, ఫైర్‌సేఫ్టీకాని లేక సినిమాహాళ్లు మృత్యు కుహరాలుగా, ప్రమాదనిలయాలుగా మారాయని, ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యతను కోర్టు తీసుకోవాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. నూటికి 90 శాతం థియేటర్లలో అగ్నిప్రమాదాల జాగ్రత్తలు పాటించటం లేదని, 780 థియేటర్లలో పొగ బయటకు వెళ్లే వీలు లేదని, 250 సినిమాహాళ్లలో ఫైరింజన్లు ఆపేందుకు స్థలం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణను 26వ తేదీకి వాయిదావేసింది.
టెక్కలి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎఇన్నకకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవతీపతి మృతి కారణంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 10న అక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని, 14న ఓట్లలెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.